నది దాటుతున్న జీబ్రా.. వెంటపడిన మొసలినే కొరికేసింది.. వీడియో ఇదిగో!
- కెన్యాలో నది దాటేందుకు ప్రయత్నిస్తున్న జీబ్రాలపై మొసళ్ల గుంపు దాడి
- ఒక జీబ్రా కాలు పట్టుకుని కొరికిన మొసలి.. వెనక్కి తిరిగి మొసలి గొంతు కొరికిన జీబ్రా
- దెబ్బకు వదిలి పెట్టిన మొసలి.. కొన్ని జీబ్రాలు మాత్రం మొసళ్ల పాలు
జీబ్రాలు అంటే సాధారణంగా సాధు జీవులే. అయితే ప్రాణం మీదికి వస్తే ఏ జంతువు అయినా తిరగబడుతుందన్న దానికి అవి ఏమీ మినహాయింపు కాదు. కెన్యాలో జరిగిన ఓ ఘటన దీన్ని రుజువు చేసింది. అది కెన్యాలోని మాసాయ్ మారా అటవీ ప్రాంతం. దాని మధ్యగా మారా నది ప్రవహిస్తుంటుంది. అటవీ ప్రాంతంలోని జీబ్రాల గుంపులు అప్పుడప్పుడూ నదికి అటూ ఇటూ వలస వెళుతుంటాయి.
అదే సమయంలో మారా నదిలోని మొసళ్లు కాపు కాసి జీబ్రాలను పట్టుకుని ఆరగించేస్తుంటాయి. ఇది తరచూ జరిగే ఘటనే. ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు.. ఈ ఘటనలను ఫొటోలు, వీడియో తీస్తుంటారు. ఈ క్రమంలో ఓ మొసలి, జీబ్రా పోరాటం కెమెరాకు చిక్కింది.
గట్టిగా కాలు కొరికి.. మెడ పట్టేసుకోబోయి..
ఇటీవల అలా ఓ జీబ్రాల గుంపు మారా నదిని దాటేందుకు ప్రయత్నించినప్పుడు మొసళ్ల గుంపు దాడి చేసింది. అందులో కొన్ని జీబ్రాలు వేగంగా తప్పించుకుని అవతలి ఒడ్డుకు చేరగా.. మరికొన్ని మొసళ్లకు ఆహారంగా మారిపోయాయి. అయితే ఓ జీబ్రా మాత్రం తనను పట్టేసుకున్న మొసలితో గట్టిగానే పోరాడింది.
కాలును కొరికేసిన మొసలిని గట్టిగా తన్నడం మొదలుపెట్టింది. రక్తమోడుతున్నా ముందుకు సాగేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో కాలును వదిలిన మొసలి జీబ్రా మెడ పట్టేసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ సమయంలో జీబ్రా ఒక్కసారిగా మొసలి మెడపై కొరికేసింది. ఆ దెబ్బకు మొసలి జీబ్రాను వదిలి పక్కకు పోయింది. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.