భారీ కాన్వాయ్ తో మునుగోడుకు బయలుదేరిన సీఎం కేసీఆర్
- ప్రగతి భవన్ నుంచి ప్రత్యేక బస్సులో ప్రయాణిస్తున్న కేసీఆర్
- ఈ మధ్యాహ్నం మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ
- సీంఎ కేసీఆర్ ప్రసంగం కోసం ఆసక్తిగా ఉన్న ప్రజలు
ప్రజాదీవెన సభ కోసం సీఎం కేసీఆర్ మునుగోడు బయలుదేరారు. సీఎం కాన్వాయ్ ప్రగతి భవన్ నుంచి బయల్దేరింది. నగరంలో వర్షం కురుస్తుండగా.. ముందుగా అనుకున్నట్టే సీఎం రోడ్డు మార్గాన ప్రత్యేక బస్సులో మునుగోడు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, నాయకులు పెద్దసంఖ్యలో తరలివెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు ఐదువేలకు పైగా కార్లలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ.. సీఎం కాన్వాయ్ ను అనుసరిస్తున్నారు. ఇక, సీఎం కేసీఆర్‌కు.. ఉప్పల్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మరోవైపు టీఆర్‌ఎస్ ప్రజాదీవెన సభకు మునుగోడులో పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు సభాస్థలికి చేరుకుంటున్నారు.
సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో సభా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లో సీఎం మునుగోడు చేరుకుంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత మునుగోడుకు ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి రేకెత్తింది. సభలో నియోజకవర్గంపై సీఎం వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది. మునుగోడులోనే ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో బీజేపీపై టీఆర్ఎస్ అధినేత విమర్శలు ఎక్కుపెట్టనున్నారు.