హిమాచల్ ప్రదేశ్ లో వరదలకు కొట్టుకుపోయిన రైల్వే వంతెన.. వీడియో ఇదిగో

  • కాంగ్రా జిల్లాలో చక్రి నదికి భారీ వరద
  • వరద తాకిడికి కూలిపోయిన బ్రిడ్జి
  • పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మధ్య రాకపోకలకు విఘాతం
వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో నదులు ఉగ్ర రూపం దాల్చాయి. కాంగ్రా, చంబ్ర, బిలాస్ పూర్, సిర్మౌర్, మండి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చక్రి నదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. వరద తీవ్రతకు కాంగ్రా జిల్లాలోని చక్రి నదిపై ఉన్న రైల్వే వంతెన శనివారం కుప్పకూలిపోయింది. ఈ వంతెన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలను కలుపుతుంది. 

జిల్లాలోని బల్హ్, సాదర్, తునంగ్, మండి, లమతచ్ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వచ్చే 24 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైల్వే వంతెన కూలిపోవడంతో పఠాన్ కోట్, జోగిందర్ నగర్ మధ్య రైల్వే సేవలు నిలిచిపోయాయి. నిత్యం సుమారు ఏడు రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. 





More Telugu News