వృద్ధులకు త్వరలో రైల్వే పాక్షిక రాయితీల పునరుద్ధరణ?

  • పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు
  • కనీసం స్లీపర్ క్లాస్, ఏసీ త్రీ టైర్ వరకు ఇవ్వాలని సూచన
  • దీనిపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోని రైల్వే శాఖ
కరోనా లాక్ డౌన్ ల తర్వాత నుంచి రైలు సేవల్లో వృద్ధులకు టికెట్లపై రాయితీలను ఎత్తివేసిన రైల్వే శాఖ ఈ రూపంలో బాగానే ఆదా చేసుకుంది. రైలు సేవలను తిరిగి పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చినప్పటికీ.. రాయితీలను ఇంత వరకు పునరుద్ధరించలేదు. దీనిపై పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వస్తున్నాయి. దీంతో కొన్ని తరగతుల వరకు అయినా సీనియర్ సిటిజన్లకు రాయితీలను పునరుద్ధరించాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి.

అవసరమైన వర్గాలకు రాయితీలను పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఇందుకు సంబంధించి నివేదికను ఇటీవలే పార్లమెంటుకు సమర్పించింది. స్లీపర్ క్లాస్, ఏసీ-3టైర్  క్లాస్ ప్రయాణికులకు రాయితీలు ఇవ్వాలని సూచించింది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వృద్ధులకు రాయితీలు ఇవ్వాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. వద్దనుకుంటే సదరు రాయితీ తీసుకోకుండా వదిలే ఆప్షన్ ను కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. దీనిపై త్వరలో రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News