జింబాబ్వేలో చుక్కలను తాకుతున్న ద్రవ్యోల్బణం
- జులై నెలకు 275 శాతానికి చేరిక
- రాజధాని హరారేలో నీటికి తీవ్ర కొరత
- బంగారం మాదిరిగా వ్యాపారం
- ఒకటికి మించిన పనులతో నెట్టుకొస్తున్న ప్రజలు
జింబాబ్వే వాసులకు నిత్యావసరాల ధరలు అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. ధరల పెరుగుదలను సూచించే ద్రవ్యోల్బణం జులై నెలకు 275 శాతానికి చేరింది. అంతకుముందు జూన్ చివరికి ఇది 191 శాతంగా ఉంది.
అక్కడ నీటికి కూడా ఇప్పుడు కొరత నెలకొంది. రాజధాని హరారేకు చెందిన ప్రాపర్టీ యజమాని 'నీరే బంగారం' అని వ్యాఖ్యానించడం గమనార్హం. నీటిని పొదుపుగా వాడుకుని, కొంత విక్రయించుకోవడం ద్వారా రోజులు నెట్టుకొస్తున్న వారు కూడా ఉన్నారు. అదృష్టం బాగుంటే రోజులో 12 బకెట్ల నీటిని 2 డాలర్లకు విక్రయిస్తామని 50 ఏళ్ల వ్యక్తి ఒకరు చెప్పారు. దాంతో ఆ కుటుంబం ఒక రోజు జీవనానికి అవసరమైన నిత్యావసరాలు సమకూరతాయట. రాజధానిలోని 24 లక్షల మంది ప్రజలు తమకు అవసరమైన నీటిని సమకూర్చుకోవడం గగనంగా మారింది.
2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం కాలంలో జింబాబ్వే వాసులు 500 శాతం ద్రవ్యోల్బణాన్ని చవిచూశారు. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి రోజులను చూడాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఈ పరిస్థితులను గమనించే అధ్యక్షుడు మంగాగ్వ బంగారం కాయిన్లకు చట్టబద్ధత కల్పించారు. దీంతో ప్రజలు బంగారం కాయిన్లను కరెన్సీ మాదిరిగా మార్చుకోవచ్చు. గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు ఒక్కో కుటుంబం ఒకటికి మించిన ఉద్యోగాలు, పనులు చేసి నెట్టుకురావాల్సిన దుర్భర పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.