విజయవాడలో కోర్టు కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీజేఐ ఎన్వీ రమణ.. హాజరైన సీఎం జగన్

  • ప్రారంభోత్సవానికి హాజరైన హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తులు
  • కార్యక్రమానికి ముందు సీజేఐని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం
  • కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటిన సీజేఐ, సీఎం
విజయవాడలో నిర్మించిన నూతన సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. కోర్టు ప్రారంభోత్సవం అనంతరం కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో సీజేఐ రమణ, సీఎం జగన్ లు మొక్కలు నాటారు. కోర్టు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు సీజేఐ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. 

ప్రస్తుతం సీజేఐ ఎన్వీ రమణ ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన ఆచార్య నాగార్జున విశ్యవిద్యాలయానికి చేరుకుంటారు. అక్కడ స్నాతకోత్సవం కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొనడంతో పాటు... విశ్వవిద్యాలయం ప్రదానం చేసే డాక్టరేట్ ను స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పట్టేటి రాజశేఖర్ తదితరులు పాల్గొంటారు.


More Telugu News