తండ్రి పేరిట ఆసుపత్రిని నిర్మించనున్న చిరంజీవి
- చిత్రపురి కాలనీలో ఆసుపత్రిని నిర్మిస్తానన్న చిరంజీవి
- ఎంత ఖర్చయినా భరిస్తానని ప్రకటన
- తాను చేసే పనులకు ప్రచారం అవసరం లేదని వ్యాఖ్య
మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు. తన తండ్రి పేరు మీద ఆసుపత్రిని నిర్మించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తానని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణానికి ఎంత ఖర్చయినా భరిస్తానని అన్నారు. తాను చేసే పనులకు పెద్దగా ప్రచారం అవసరం లేదని అయితే... దీనికి సంబంధించిన సమాచారాన్ని మాత్రం కచ్చితంగా ఇవ్వాలని... పది మందికి తెలిస్తే, వాళ్లు కూడా స్ఫూర్తి పొందుతారని, వాళ్లు కూడా మంచి పనులు చేస్తారని చెప్పారు.
మన సినీ క్రికెటర్లు సెప్టెంబర్ 24 నుంచి అమెరికాలోని డల్లాస్ లో క్రికెట్ టోర్నీ ఆడనున్నారు. దీనికి సంబంధించిన జెర్సీని చిరంజీవి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, డల్లాస్ ట్రోఫీ ద్వారా వచ్చే కొంత మొత్తాన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇస్తామని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ... తన వంతుగా మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించి ఆసుపత్రి నిర్మాణం కోసం ఆ డబ్బును ఇస్తానని తెలిపారు.