సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను సతీసమేతంగా కలిసిన ఏపీ సీఎం

  • విజయవాడ చేరుకున్న సీజేఐ రమణ
  • నోవాటెల్ హోటల్‌లో 20 నిమిషాలపాటు సీజేఐతో జగన్ భేటీ
  • నూతన న్యాయస్థానాల భవనాలను ప్రారంభించనున్న జస్టిస్ రమణ
  • మరికాసేపట్లో సీజేఐతో చంద్రబాబు భేటీ
విజయవాడ చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా కలుసుకున్నారు. నగరంలోని నోవాటెల్ హోటల్‌లో ఉన్న జస్టిస్ రమణను భార్య భారతితో కలిసి కలుసుకున్నారు. ఈ సందర్భంగా 20 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. ఇది మర్యాదపూర్వక భేటీయేనని చెబుతున్నారు. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, సీఎం జగన్‌తో కలిసి విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ ప్లస్ 7 నూతన భవనాలను నేడు సీజీఐ ప్రారంభిస్తారు. ఈ భవనంలో 29 విశాలమైన ఏసీ కోర్టుల హాళ్లు, ఏడు లిఫ్టులు, న్యాయవాదులు, కక్షిదారులకు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్ సహా అన్ని సదుపాయాలతో ఈ నూతన భవనాలను తీర్చదిద్దారు. కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా మరికాసేపట్లో సీజేఐ జస్టిస్ రమణను కలవనున్నారు.


More Telugu News