మునుగోడులో లక్షమంది కాళ్లు మొక్కనున్న కాంగ్రెస్.. వినూత్న ప్రచారానికి తెరలేపిన టీపీసీసీ
- ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్
- రంగంలోకి వెయ్యిమంది రేవంత్ అభిమానులు
- ఓ వైపు పాదయాత్ర.. మరోవైపు కాళ్లు మొక్కే కార్యక్రమం చేపట్టనున్న టీపీసీసీ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు ఉప ఎన్నికలో మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం టీపీసీసీ వినూత్న ప్రణాళిక సిద్ధం చేసింది. మునుగోడులో పాదయాత్ర చేయాలని నిర్ణయించింది.
అంతేకాదు, ఇంటింటికీ వెళ్లి లక్షమంది కాళ్లు మొక్కి ఓట్లు అడగాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి అభిమానులు వెయ్యిమంది రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. వీరందరితో కలిసి స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. ఓ వైపు పార్టీ నేతలు ప్రచారంలో బిజీగా ఉంటే.. రేవంత్ బృందం ఓటర్ల కాళ్లు మొక్కేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
మరోవైపు, మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అన్ని పార్టీలూ విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీ అగ్రనేత, హోంమంత్రి అమిత్ షాలు బహిరంగ సభలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఈ సరికొత్త ప్రచారానికి సిద్ధమవుతోంది.