నారా లోకేశ్‌కు క‌నీస లోక జ్ఞానం కూడా లేదు: మంత్రి పెద్దిరెడ్డి

  • ఎన‌ర్జీ అసిస్టెంట్ల‌కు విధుల కేటాయింపుపై లోకేశ్ వ్యాఖ్య‌లు
  • వాటిని ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి
  • అనుభ‌వ‌రాహిత్యం, అవివేకం, అజ్ఞానంతోనే లోకేశ్ వ్యాఖ్య‌ల‌న్న మంత్రి
టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్‌పై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి శుక్రవారం విరుచుకుప‌డ్డారు. నారా లోకేశ్‌కు క‌నీస లోక జ్ఞానం కూడా లేద‌ని మంత్రి ఎద్దేవా చేశారు. అవివేకం, అనుభ‌వ రాహిత్యం, అజ్ఞానంతోనే లోకేశ్ ప్రేలాప‌న‌లు చేస్తున్నారని ఆయ‌న అన్నారు. చంద్ర‌బాబు హ‌యాంలో యువ‌త‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించ‌లేద‌ని ఆరోపించారు. ఇలాంటి నేప‌థ్యంలో త‌మ ప్ర‌భుత్వ హ‌యాంలో కొత్త‌గా ఉద్యోగాలు పొందిన యువ‌త‌పై మాట్లాడే అర్హ‌త లోకేశ్‌కు లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.  

ఎన‌ర్జీ అసిస్టెంట్ల‌కు విధుల కేటాయింపుపై లోకేశ్ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్తవం లేద‌ని పెద్దిరెడ్డి తెలిపారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే ఎన‌ర్జీ అసిస్టెంట్ల‌కు విధులు కేటాయించామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే ఈ విష‌యాన్ని మ‌రిచిన లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు ఎన‌ర్జీ అసిస్టెంట్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని పెద్దిరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


More Telugu News