ఎనిమిది రోజుల లాభాలకు బ్రేక్.. భారీగా నష్టపోయిన మార్కెట్లు

  • ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 651 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 198 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా ఎనిమిది రోజుల పాటు లాభపడిన మార్కెట్లు ఈరోజు నష్టపోయాయి. వాస్తవానికి ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. అయితే, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 651 పాయింట్లు నష్టపోయి 59,646కి పడిపోయింది. నిఫ్టీ 198 పాయింట్లు కోల్పోయి 17,758కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.20%), ఇన్ఫోసిస్ (0.93%), టీసీఎస్ (0.12%). 

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.82%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.08%), బజాజ్ ఫైనాన్స్ (-2.53%), టాటా స్టీల్ (-2.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.25%).


More Telugu News