సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత లేఖ‌

  • బిల్కిస్ బానో వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావించిన క‌విత‌
  • దోషుల విడుద‌ల‌పై స్పందించాల‌ని అభ్య‌ర్థ‌న‌
  • ఘట‌న జ‌రిగినప్పుడు బాధితురాలు 5 నెల‌ల గ‌ర్భిణీ అని ప్రస్తావన 
సంచ‌ల‌నం రేకెత్తించిన బిల్కిస్ బానో కేసు వ్య‌వ‌హారంలో దోషుల విడుద‌ల‌పై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఈ కేసులో దోషులు బ్రాహ్మ‌ణులు అని, సంస్కార‌వంతులు అని బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లపై విమర్శ‌లు రేకెత్తాయి. అంతేకాకుండా దోషుల విడుద‌ల చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ప‌లు పార్టీల‌కు చెందిన నేత‌లు విమర్శిస్తున్నారు.  

ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత శుక్ర‌వారం భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఓ లేఖ రాశారు. బిల్కిస్ బానోపై అ‌త్యాచారం జ‌రిగిన స‌మ‌యంలో ఆమె 5 నెల‌ల గర్భిణీ అన్న విష‌యాన్ని త‌న లేఖ‌లో ప్ర‌స్తావించిన క‌విత‌... ఈ కేసులో దోషుల విడుద‌ల‌పై స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్పందించాల‌ని, దేశ ప్ర‌జ‌ల్లో న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం ఇనుమ‌డింప‌జేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆమె జ‌స్టిస్ ర‌మ‌ణ‌ను కోరారు.


More Telugu News