ఓటుకు నోటు వీడియో మీద ప్రమాణం చేస్తారా?.. చంద్రబాబుకు ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్
- వీడియో కాల్‌పై మరోమారు స్పందించిన ఎంపీ గోరంట్ల మాధవ్
- కాణిపాకం ఆలయంలో తాను ప్రమాణానికి సిద్ధమని వెల్లడి
- చంద్రబాబు ప్రమాణం చేయడానికి సిద్ధమేనా? అని సవాల్
- ఫేక్ వీడియోతో చంద్రబాబు తైతక్కలాడుతున్నారని ఎద్దేవా
ఓ మహిళతో తాను నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా వస్తున్న ఆరోపణలపై వైసీపీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరోమారు స్పందించారు. తన వీడియో ఫేక్ అని పోలీసుల విచారణలో తేలిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఫేక్ వీడియో చేతబట్టుకుని ఓ బీసీ ఎంపీని ఇంతలా వేధిస్తున్నారని ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఆ వీడియోలో ఉన్నది తానేనని, ఆ వీడియో ఒరిజినలేనని తేలితే... తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించేది తానేనని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ మహిళతోనూ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడలేదన్న గోరంట్ల... ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వీడియో నకిలీదని ప్రమాణం చేసేందుకు చంద్రబాబు సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. తనదని చెబుతున్న వీడియో నిజమైనది కాదని తాను కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని ఆయన తెలిపారు. చంద్రబాబు ఫేక్ వీడియోను పట్టుకుని తైతక్కలాడాల్సిన అవసరం లేదని.. కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి ఆయన సిద్ధమా? అని గోరంట్ల ప్రశ్నించారు.