సిసోడియాపై సీబీఐ దాడుల నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ 'మిస్డ్ కాల్' ప్రచారం

  • ‘మేక్ ఇండియా నంబర్ వన్’ మిషన్ కు మద్దతు కోరిన కేజ్రీవాల్  
  • 951000100 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని అభ్యర్థన 
  • దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుదామన్న ఢిల్లీ సీఎం
  • సీబీఐ దాడులకు భయపడేది లేదని ప్రకటన
లిక్కర్ స్కామ్ ఆరోపణలతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు చేస్తున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సరికొత్త  ప్రచారానికి తెరదీశారు. ఇటీవల ప్రకటించిన ‘మేక్ ఇండియా నంబర్ వన్’ మిషన్ కు మద్దతుగా మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలను కోరారు. 

‘మేక్ ఇండియా నంబర్ వన్ అనే మా నేషనల్ మిషన్లో భాగం అయ్యేందుకు 951000100 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి. మనమంతా దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం’ అంటూ కేజ్రీవాల్ ఓ వీడియోలో ప్రజలను కోరారు.  

ఢిల్లీలో అధికార ఆప్ ప్రభుత్వంలో నంబర్2గా కొనసాగుతున్న సిసోడియా నివాసాల్లో సీబీఐ సోదాలపై అంతకుముందు అరవింద్ స్పందించారు. సీబీఐ సోదాలు అనగానే భయపడాల్సిన అవసరం లేదన్నారు. వాళ్ల పని వాళ్లు చేసుకోవచ్చని, తమను వేధించాలని కేంద్రం నుంచి సీబీఐకి ఆదేశాలు వచ్చాయని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేసే వాళ్లను బీజేపీ వెంటాడుతోందని విమర్శించారు. 



More Telugu News