మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

  • గత 24 గంటల్లో 15,754 కొత్త కేసుల నమోదు
  • 39 మంది మృతి చెందినట్లు వెల్లడి
  • ప్రస్తుతం 1,01,830 క్రియాశీల కేసులు
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,754 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది. వరుసగా రెండు రోజుల్లో దాదాపు మూడు వేలకు పైగా కేసులు పెరగడం గమనార్హం. అదే సమయంలో వైరస్ వల్ల తాజాగా మరో 39 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో, కరోనా వల్ల దేశంలో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 5,27,253కి చేరుకుంది.

ప్రస్తుతం దేశంలో 1,01,830 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,43,14,618కి చేరుకుంది. గత 24 గంటల్లో 15,220 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాంతో, ఇప్పటిదాకా  కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,36,85,535కి చేరుకుంది. క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. రోజువారీ పాటిజివిటీ రేటు 3.47 శాతంగా ఉంది. ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 209.27 కోట్ల కరోనా వ్యాక్సిన్లు అందజేసినట్టు కేంద్రం తెలిపింది.


More Telugu News