జాతీయ గీతాలాపనకు ముందు కేఎల్ రాహుల్ చేసిన పనికి ప్రశంసలు

  • భారత్-జింబాబ్వే జట్ల మధ్య తొలివన్డే మ్యాచ్ కు ముందు ఘటన
  • నోటి నుంచి చూయింగ్ గమ్ తీసేసిన రాహుల్
  • జాతీయ గీతానికి గౌరవం ఇచ్చిన టీమిండియా కెప్టెన్
జింబాబ్వే సిరీస్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న కేఎల్ రాహుల్.. ఇప్పుడు ఓ చిన్న పనితో ప్రచారంలోకి వచ్చాడు. జింబాబ్వే, భారత జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ గురువారం జరిగింది. దీనికి ముందు భారత జాతీయ గీతాలాపన జరిగింది. భారత జట్టు సభ్యులు వరుసగా నించున్నారు. 

ఆ సమయానికి రాహుల్ నోట్లో చూయింగ్ గమ్ ఉంది. దాంతో గీతాలాపన ప్రారంభం కావడానికి క్షణాల ముందు, నోట్లోని చూయింగ్ గమ్ చేత్తో బయటకు తీసి కింద పడేశాడు. తద్వారా జాతీయ గీతం పట్ల తనకున్న గౌరవాన్ని చాటి చెప్పాడు. దీనిపైనే నెట్ ప్రపంచంలో రాహుల్ పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ఇందుకు సంబంధించిన వీడియో నెట్ లో ఎక్కువగా షేర్ అవుతోంది. జాతీయ గీతానికి తగిన గౌరవం ఇచ్చాడని, రాహుల్ ను చూసి గర్విస్తున్నానని, ఇలా నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి వన్డేలో రాహుల్ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం రానీయకుండా ఓపెనర్లు అయిన శుభ్ మన్ గిల్, శిఖర్ ధావన్ దంచికొట్టి భారత్ కు ఘన విజయాన్ని అందించడం తెలిసిందే. 





More Telugu News