బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ వ్యాఖ్యలు... నీ పని నువ్వు చూస్కో అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కౌంటర్
- ఇటీవల పలు చిత్రాలకు బాయ్ కాట్ దెబ్బ
- లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ చిత్రాలకు నష్టం
- ఇంకా సహనంతో ఉండడం మంచిదికాదన్న అర్జున్ కపూర్
- ఫ్లాప్ హీరో అంటూ ఎద్దేవా చేసిన మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా
ఇటీవల కాలంలో బాలీవుడ్ లో పలు కొత్త చిత్రాలకు బాయ్ కాట్ ప్రచారం తీవ్ర నష్టం కలుగచేసింది. తాజాగా లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ చిత్రాలపైనా బాయ్ కాట్ దెబ్బపడింది. కొన్ని సినిమాల్లో అభ్యంతరకర భావజాలం ఉందని, ఆ సినిమాలు చూడొద్దంటూ ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. దీనిపై బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ స్పందించారు.
దీనిపై చాన్నాళ్లుగా మౌనంగా ఉంటూ తప్పు చేశామనిపిస్తోందని అన్నారు. మన మంచితనాన్ని బలహీనతగా భావిస్తున్నారని, మనం చేసే పనే మాట్లాడాలని, మిగతావన్నీ పట్టించుకోనవసరంలేదని పేర్కొన్నారు. బాయ్ కాట్ ట్రెండ్ పై బాలీవుడ్ ఏకతాటిపైకి రావాలని, ఈ సమస్యకు మూలకారణం ఎక్కడుందో కనుక్కోవాలని సూచించారు. 'మనం మరీ అతి సహనం పాటిస్తున్నాం... దాన్ని ప్రజలు వాడుకుంటున్నారు' అని అర్జున్ కపూర్ వ్యాఖ్యానించారు.
కాగా, అర్జున్ కపూర్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందించారు. అర్జున్ కపూర్ ను ఒక ఫ్లాప్ నటుడు అని పేర్కొన్నారు. జనాన్ని బెదిరించేకంటే అర్జున్ కపూర్ తన నటనపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. తమ చిత్రాల్లో హిందుత్వాన్ని టార్గెట్ చేస్తూ టుక్డే టుక్డే గ్యాంగ్ కు మద్దతు పలికేవారు ప్రజలను బెదిరించడం మానుకోవాలని మంత్రి హెచ్చరించారు.