నోరు చూసి ఆరోగ్యం ఏ పాటిదో తెలుసుకోవచ్చు..!
- నోటిలో చిగుళ్ల వ్యాధులు గుండె జబ్బులకు సూచిక
- నాలుక తెల్లగా ఉంటే అది కేన్సర్ కూడా కావచ్చు
- నోటిలో తరచూ పుండ్లు వస్తుంటే అశ్రద్ధ వద్దు
- నోటి దుర్వాసనను కూడా తేలిగ్గా తీసుకోవద్దు
నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. మన నోటిని పరీక్షించి చూసి, మనకు భవిష్యత్తులో వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు. నోటి దుర్వాసన, నాలుక రంగు, చిగుళ్ల రూపం ఇవన్నీ ఆరోగ్య పరిస్థితులకు సంకేతాలుగా పేర్కొంటున్నారు. వీటిని ముందుగా గుర్తించి వైద్యులను సంప్రదించడం ద్వారా త్వరగా బయటపడొచ్చు.
చిగుళ్లు
దంతాలను పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇవి పాలిపోయినట్టున్నా.. లేదంటే బ్రష్ చేసిన సమయంలో రక్త స్రావం అయినా అది చిగుళ్ల వ్యాధి సంకేతంగా తీసుకోవాలి. అంతేకాదు, తగిన చికిత్స కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇతర సమస్యలకు దారితీస్తుంది. చిగుళ్ల వ్యాధితో బాధపడే వారు, భవిష్యత్తులో గుండె జబ్బు, స్ట్రోక్ బారిన పడే రిస్క్ ఇతరులతో పోలిస్తే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. వాచిన, రక్తస్రావం అవుతున్న చిగుళ్లు అన్నవి విటమిన్ల లోపానికి ఒక సంకేతం.
నాలుక
నాలుక పింక్ రంగులో ఉండి, పైన తెల్లటి లేయర్ పలుచగా ఉంటే అది సహజమే. అలా కాకుండా, నాలుకపై కొంచెం ఎక్కువగా తెల్లటి కోటింగ్ ఉందంటే అది కేన్సర్ కు సంకేతం కావచ్చు. కనుక వైద్యులకు చూపించి, పరీక్షలు చేయించుకోవాలి. ఇక నాలుక తెల్లగా ఉంటే, అది కేన్సరే కానక్కర్లేదు. అది ఓరల్ లిచెన్ ప్లానస్ కూడా కావచ్చు. ఎస్టీఐ సిఫిలిస్ అయితే మరింత ప్రమాదకరం. అందుకే బ్రష్ చేసి, టంగ్ ను క్లీన్ చేసుకున్న తర్వాత కూడా తెల్లటి ప్యాచ్ కనిపిస్తే వైద్యులకు ఓసారి చూపించాలి.
నోటి అల్సర్లు/పుండ్లు
నోటిలో అల్సర్లు కూడా కొంత మందికి సాధారణంగా వస్తుంటాయి. అప్పుడప్పుడు రావడం, వాటంతట అవే మానిపోవడం సహజమే. హార్మోన్లలో మార్పులు, బీ విటమిన్లు, జింక్, ఐరన్ లోపం వల్ల నోటిలో పుండ్లు కనిపిస్తుంటాయి. రోగ నిరోధక శక్తి బలహీనపడడం వల్ల కూడా ఇవి కనిపిస్తాయి. క్రాన్స్, కోలియాక్, లూపస్ వ్యాధుల్లోనూ నోటిలో అల్సర్లు వస్తుంటాయి. అందుకని తరచుగా వస్తుంటే ఓ సారి వైద్యులను కలిసి కారణాన్ని గుర్తించి, చికిత్స తీసుకోవాలి.
నోటి దుర్వాసన
నోటి ఆరోగ్యాన్ని సూచించే ప్రథమ సంకేతం శ్వాసే. నోటి నుంచి మనం విడుదల చేసే శ్వాస చెడు వాసన వస్తుంటే చుట్టుపక్కల ఉన్న వారు ఎంతో అసౌకర్యానికి లోనవుతారు. నోటి శుభ్రత తెలియని వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. చిగుళ్ల వ్యాధి ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది. ముక్కు, సైనస్, గొంతులో ఇన్ ఫ్లమ్మేషన్ ఉన్నా ఇలానే జరుగుతుంది. జీవక్రియల సమస్యలు, కేన్సర్ మహమ్మారి ఉన్న వారిలో, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్న వారిలోనూ ఇది కనిపిస్తుంది.
కార్నర్ క్రాకర్
పెదాల పక్క భాగాల్లో మడతల వద్ద క్రాక్ లు కనిపించినట్టయితే అది ఐరన్, జింక్, బీ విటమిన్ల లోపంగా చూడాలి. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. కొలియాక్ డిసీజ్, క్రాన్స్ లేదా అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వారికి పెదాల చిగుళ్లు కనిపిస్తాయి.