వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ వీ25 ప్రో విడుదల

  • రెండు వేరియంట్లలో లభ్యం
  • వీటి ధరలు రూ.35,999, రూ.39,999
  • ఈ నెల 25 నుంచి ఫ్లిప్ కార్ట్ పై విక్రయాలు
  • హెచ్ డీఎఫ్ సీ కార్డులపై రూ.3,500 తగ్గింపు
చైనా కంపెనీ వివో వీ25 ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఆరంభ ధర రూ.35,999. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన వివో వీ23 ప్రోకు ఇది కొనసాగింపు, అప్ గ్రేడెడ్ వెర్షన్ గా చూడొచ్చు. 

6.56 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన స్క్రీన్, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో, సెంటర్ పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ఎస్ వోసీ చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 8జీబీ వరకు ర్యామ్ ను విస్తరించుకునే ఆప్షన్ కూడా ఉంది. ఫోన్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 4,830 ఎంఏహెచ్ బ్యాటరీ తో పాటు, 66 వాట్ ఫాస్ట్ చార్జర్ వస్తుంది. బ్యాక్ ప్యానెల్ రంగు మారిపోతుండడం ప్రత్యేక ఆకర్షణ.

వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సెన్సార్లు ఉంటాయి. దీంతో ఫొటోలు బ్లర్ కాకుండా, స్పష్టంగా తీసుకోవచ్చు. 8 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ.35,999. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ ధర రూ.39,999. 

ఈ నెల 25 నుంచి ఫ్లిప్ కార్ట్ పై విక్రయాలు మొదలవుతాయి. కావాలంటే ఇప్పుడే ప్రీ బుక్ చేసుకునేందుకు ఫ్లిప్ కార్ట్ అనుమతిస్తోంది. అంతేకాదు కొనుగోళ్లపై మంచి ఆఫర్లను కూడా ప్రకటించింది. హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కార్డులపై రూ.3,500 తగ్గింపు ఇస్తోంది. పాత ఫోన్ ను ఎక్చేంజ్ చేసుకుంటే రూ.7,000, దీనికి బోనస్ రూపంలో మరో రూ.3,000 తగ్గింపు ఇస్తోంది. అంటే కస్టమర్లు రూ.13,500 తక్కువకే కొనుగోలు చేసుకోవచ్చు.


More Telugu News