కాలాబత్తి, మైసూర్ మల్లిక... తన పొలంలో విభిన్న రకాల వరి పండిస్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • కొన్నాళ్లుగా వ్యవసాయం చేస్తున్న లక్ష్మీనారాయణ
  • కాకినాడ జిల్లా ధర్మవరంలో పొలం కౌలుకు తీసుకున్న వైనం
  • ప్రకృతి విధానంలో వ్యవసాయం
  • వరినాట్లు పూర్తయ్యాయంటూ ట్విట్టర్ లో వెల్లడి
సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా విశేష రీతిలో సేవలు అందించిన వీవీ లక్ష్మీనారాయణ పదవీ విరమణ తర్వాత తనకిష్టమైన వ్యాపకాలపై దృష్టి పెట్టారు. గత కొన్నేళ్లుగా ఆయన కాకినాడ జిల్లా ధర్మవరం వద్ద పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. క్రమం తప్పకుండా వరిసాగు చేస్తూ, ప్రకృతి వ్యవసాయ విధానాలతో ఇరుగుపొరుగు రైతుల్లోనూ స్ఫూర్తి కలిగిస్తున్నారు. 

తాజాగా, తన పొలంలో వరినాట్లు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను లక్ష్మీనారాయణ పంచుకున్నారు. కాలాబత్తి, మైసూర్ మల్లిక రకం వరి పండిస్తున్నామని, దానికి సంబంధించి నాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. వరినాట్లు సందర్భంగా సహకరించిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.


More Telugu News