వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్న 'వీరమల్లు'
- 'వీరమల్లు'గా పవన్ కల్యాణ్
- 17వ శతాబ్దంలో నడిచే కథ
- కథనాయికగా నిధి అగర్వాల్
- సంగీత దర్శకుడిగా కీరవాణి
పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా, 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ఆ సమయంలో కరోనా తీవ్రత కారణంగా షూటింగును ఆపేశారు. ఆ తరువాత 'భీమ్లా నాయక్' ను పూర్తిచేయాలనే ఉద్దేశంతో పవన్ ఈ వైపునే పూర్తి ఫోకస్ పెట్టారు. అలా ఈ సినిమా షూటింగు ఆలస్యమవుతోంది.
ఈ కథ 17వ శతాబ్దంలో నడుస్తుంది. అందువలన ఆ కాలంలోని నిర్మాణాలకు సంబంధించిన సెట్స్ వేశారు. ఎప్పటికప్పుడు ఇక షూటింగు మొదలవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. కానీ పవన్ రాజకీయాలలో బిజీగా ఉండటం వలన షూటింగు ఆలస్యమవుతూ వస్తోంది. ఈ మధ్యలో కొన్ని రోజులు మాత్రమే షూట్ చేశారు.
ఇక వచ్చేనెలలో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను మొదలెట్టనున్నట్టు చెబుతున్నారు. పవన్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, నిధి అగర్వాల్ కథానాయికగా అలరించనుంది. అర్జున్ రాంపాల్ .. నర్గిస్ ఫక్రి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.