రాజకీయ నేతల పేర్లు చెప్పాలని విచారణలో బెదిరిస్తున్నారు: చికోటి ప్రవీణ్

  • కేసినోలను లీగల్ గానే చేశానన్న ప్రవీణ్ 
  • అన్ని రాజకీయ పార్టీల నేతలతో తనకు సంబంధాలు ఉన్నాయని వెల్లడి 
  • కేసినోలకు వీఐపీలు, వీవీఐపీలు వచ్చారని వివరణ 
చికోటి ప్రవీణ్ కేసినో వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయనపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఈరోజు ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని... కేసినోను లీగల్ గానే చేశానని చెప్పారు. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని తెలిపారు. రాజకీయ నేతల పేర్లు చెప్పాలని విచారణలో బెదిరిస్తున్నారని అన్నారు. తన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని తెలిపారు. 

మీడియాలో వస్తున్నట్టుగా తాను ఎలాంటి హవాలా వ్యాపారాలు నిర్వహించలేదని చికోటి ప్రవీణ్ చెప్పారు. తనకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయని తెలిపారు. అయితే, రాజకీయాలతో మాత్రం సంబంధం లేదని అన్నారు. తన కేసినోలకు వీఐపీలు, వీవీఐపీలు వచ్చిన మాట నిజమేనని చెప్పారు. సినీ ప్రముఖుల చేత ప్రమోషన్లు చేయించానని... వారికి నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశానని తెలిపారు.


More Telugu News