వాతావరణం, ప్రజారోగ్యానికి పెద్ద పీట.. అమెరికాలో కీలక బిల్లు ఆమోదం

  • సంతకం చేసిన అధ్యక్షుడు జోబైడెన్
  • ఉభయ సభల్లో ఇంతకుముందే ఆమోదం
  • ప్రజలపై ఆరోగ్య వ్యయాల భారం తగ్గించే లక్ష్యం
  • పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
అమెరికా చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బిల్లుగా పేర్కొంటున్న ‘ఇన్ ఫ్లేషన్ రిడక్షన్ యాక్ట్, 2022’పై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఈ బిల్లును అమెరికాలోని ఉభయ సభలు ఆమోదించాయి. పర్యావరణం పరిరక్షణ, ప్రజారోగ్య సంరక్షణ కోసం 740 బిలియన్ డాలర్లను అమెరికా వ్యయం చేయనుంది.  

కాలుష్యం వల్ల భూతాపం పెరిగిపోయి వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్న విషయం తెలిసిందే. దీన్ని తగ్గించేందుకు 375 బిలియన్ డాలర్లను అమెరికా ఖర్చు చేయనుంది. అలాగే, దేశ ప్రజల ఆరోగ్య బీమా కోసం, ఒక్కొక్కరు ఏడాదికి వారి జేబు నుంచి 2,000 డాలర్లకు మించి ఖర్చు చేసే అవసరం లేకుండా చూడడం మరొకటి. 

ఇందుకు కావాల్సిన నిధుల కోసం పెద్ద కంపెనీలు, సంపన్నులపై అదనపు పన్ను వేయనున్నారు. వైద్యులు సూచించే మందుల ధరలు తగ్గించనున్నారు. వైద్య ప్రయోజనాలను బీమా కింద పెంచనున్నారు. పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యం పెంచనున్నారు.


More Telugu News