అమరావతి నుంచి అరసవిల్లి వరకు.. అమరావతి రైతుల పాదయాత్ర

  • అమరావతిలో నిర్మాణాలు కొనసాగించాలని రైతుల డిమాండ్
  • సెప్టెంబరు 12న మహా పాదయాత్ర మొదలు
  • పల్లెలు, పుణ్యక్షేత్రాల మీదుగా అరసవిల్లికి
అమరావతి రైతులు మరోమారు భారీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతేడాది తుళ్లూరు నుంచి తిరుపతికి చేపట్టిన పాదయాత్రకు విశేష స్పందన రావడంతో ఇప్పుడు మరోమారు మహా పాదయాత్రకు రైతులు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న హైకోర్టు తీర్పునకు కట్టుబడి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబరు 12 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. 

అమరావతిలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 60 రోజులకుపైగా కొనసాగి అరసవిల్లిలో ముగుస్తుంది. పల్లెలు, వివిధ పుణ్యక్షేత్రాల మీదుగా యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అంతకుముందు రోజు దీక్షా శిబిరంలో హోమం నిర్వహిస్తారు.


More Telugu News