తిరుపతి ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థకు ఎలా కేటాయిస్తారు?: సీపీఐ నారాయణ ధ్వజం

  • వైఎస్సార్ ప్రారంభించిన ప్రసూతి ఆసుపత్రిని జగన్ తొలగిస్తున్నాడన్న నారాయణ   
  • జగన్, రజని, శిరీష మహిళా ద్రోహులేనని విమర్శలు
  • నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ 
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ సీఎం జగన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, తిరుపతి మేయర్ శిరీషలపై ధ్వజమెత్తారు. వాళ్లంతా మహిళా ద్రోహులని పేర్కొన్నారు. తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థకు కేటాయించడం పట్ల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్సార్ ప్రారంభించిన ప్రసూతి ఆసుపత్రిని ఆయన కుమారుడు జగన్ తొలగిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని నగరపాలక సంస్థకు ఎలా కేటాయిస్తారని నారాయణ ప్రశ్నించారు. వైద్యశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


More Telugu News