కాస్త తగ్గిన ద్రవ్యోల్బణం.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 379 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 127 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా పెరిగిన ఎం అండ్ ఎం, మారుతి, ఏసియన్ పెయింట్స్ షేర్స్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 379 పాయింట్లు లాభపడి 59,842కి చేరుకుంది. నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 17,825 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.28%), మారుతి (2.19%), ఏసియన్ పెయింట్స్ (2.09%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.90%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.29%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.90%), భారతి ఎయిర్ టెల్ (-0.85%), బజాజ్ ఫైనాన్స్ (-0.26%), టీసీఎస్ (-0.20%), ఎన్టీపీసీ (-0.03%).


More Telugu News