క్రికెట్ కూడా ఫుట్ బాల్ లా మారిపోతోంది.. వన్డే, టెస్టు ఫార్మాట్లను కాపాడాలి: కపిల్ దేవ్
- యూరప్ లో కేవలం నాలుగేళ్లకోసారి ప్రపంచకప్ లో మాత్రమే ఆడతారన్న కపిల్
- మిగతా సమయంలో క్లబ్లకు ఆడుతారని వివరణ
- మన దగ్గర టీ20 లీగ్ లతో అలాంటి పరిస్థితే వస్తోందని వ్యాఖ్య
- ఐసీసీ దీనిపై దృష్టి పెట్టాల్సి ఉందని సూచన
యూరప్ లో ఫుట్ బాల్ లా మన క్రికెట్ కూడా తయారవుతోందని భారత్ కు తొలి ప్రపంచకప్ సాధించి పెట్టిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. యూరప్ లో ఫుట్ బాల్ టీమ్ లు, ప్లేయర్లు ప్రతి దేశంతో ఆట ఆడటం లేదని.. వారు కేవలం నాలుగేళ్ల కోసారి ప్రపంచకప్ లో మాత్రమే ఆడతారని పేర్కొన్నారు. ఇప్పుడు మన క్రికెట్ కూడా అదే మార్గంలో వెళుతున్న పరిస్థితి ఉందని.. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్ లను దృష్టిలో ఉంచుకుని ఆయన వ్యాఖ్యానించారు.
వన్డే, టెస్ట్ ఫార్మాట్లను కాపాడుకోవాలి
యూరప్ లో ఫుట్ బాల్ ప్లేయర్లు, టీమ్ లు కేవలం ప్రపంచ కప్ లో ఆడి మిగతా సమయంలో క్లబ్ లకు ఆడుతున్న పరిస్థితి ఉందని, ఇప్పుడు క్రికెట్ లోనూ అలాంటి పరిస్థితి నెలకొందని కపిల్ దేవ్ పేర్కొన్నారు. వన్డే, టెస్ట్ ఫార్మాట్లను కాపాడేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ఐసీసీ) చర్యలు తీసుకోవాల్సి ఉందని సూచించారు. ఐసీసీ కేవలం టీ20 ఫార్మాట్ క్రికెట్ ను మాత్రమే కాకుండా.. వన్డేలు, టెస్టుల ఫార్మాట్ ను బతికించడానికి తగినంత సమయం కేటాయించాలని కోరారు.
దేశాల బోర్డులు టీ20పై దృష్టి పెడుతుండటంతో..
ఇప్పటికే క్రికెట్ షెడ్యూల్స్ పూర్తి షెడ్యూల్ తో నడుస్తున్న పరిస్థితి ఉందని.. ఇలాంటి సమయంలో టీ20 లీగ్ లు మరింత ఒత్తిడి పెంచుతున్నాయని క్రికెట్ నిపుణులు అంటున్నారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తదితర దేశాలు టీ20 లీగ్ ల కోసం తమ జట్లకు ప్రత్యేకంగా సమయం కేటాయించాలని భావిస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ నిర్వహణకు సంబంధించి కపిల్ దేవ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.