సినీ నటుడు కాకముందు విజయ్ దేవరకొండ ఎవరి దగ్గర పని చేశాడో తెలుసా?
- చిన్న నటుడి స్థాయి నుంచి పాన్ ఇండియా లెవెల్ కు విజయ్ దేవరకొండ
- దేశ వ్యాప్తంగా 'లైగర్'పై భారీ అంచనాలు
- తొలి రోజుల్లో తేజ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన విజయ్
యంగ్ హీరో విజయ్ దేవరకొండకు రోజురోజుకూ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్... ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ ను టార్గెట్ చేశాడు. 'లైగర్'గా యావత్ దేశ సినీ అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకముందే విజయ్ కు నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ నెలకొంది. బాలీవుడ్ భామలు కూడా విజయ్ తో సినిమాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 'లైగర్' హిట్ అయితే విజయ్ రేంజ్ ఎక్కడికో పోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
మరోవైపు, ఒక్కరోజులో విజయ్ కు ఇంతటి స్థాయి దక్కలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎంతో కష్టపడి ఈ రేంజ్ కు చేరుకున్నాడు. తొలి నాళ్లలో చిన్న పాత్రలను కూడా పోషించాడు. నెగెటివ్ రోల్స్ లో నటించాడు. నటుడు కాకముందు... సినీ పరిశ్రమలో పరిచయాలు పెంచుకునేందుకు తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. దర్శకుడు తేజ వద్ద అసిస్టెంట్ గా పని చేశాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా వెల్లడించాడు.
పూరి జగన్నాథ్ అయితే జీతం ఎక్కువ ఇస్తారని... ఆయన వద్దకు వెళ్లాలని తన తండ్రి చెప్పారని... ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఆఫీసుకు వెళ్లానని, కానీ ఆయనను కలవడం కుదరలేదని విజయ్ తెలిపాడు. 'డియర్ కామ్రేడ్' సినిమా తర్వాత ఆయనను కలవడం జరిగిందని చెప్పాడు. ఇప్పుడు ఆయనతో 'లైగర్' సినిమా చేశానని తెలిపాడు. ఈ సినిమాను తొలుత తెలుగు సినిమాగానే చేద్దామనుకున్నామని... కథ మొత్తం విన్న తర్వాత పాన్ ఇండియా లెవెల్లో చేద్దామనే నిర్ణయానికి వచ్చామని చెప్పాడు. మరోవైపు, ఈ నెల 25న 'లైగర్' చిత్రం విడుదలవుతోంది.