వారంలో 50 కోట్లు లేని ‘లాల్ సింగ్ చడ్డా’ కలెక్షన్స్.. వంద కోట్లు ఇక కలేనా!
- తొలి ఐదు రోజుల్లో రూ. 45 కోట్లు మాత్రమే రాబట్టిన చిత్రం
- మరో వారంలో ముగియనున్న ఆమిర్ చిత్రం వ్యాపారం
- వంద కోట్లు కూడా రాబట్టడం కష్టమే అంటున్న ట్రేడ్ వర్గాలు
ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ నెల 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం రక్షా బంధన్, పంద్రాగస్టు సెలవులతో కూడిన తొలి వారంతాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. తొలి ఐదు రోజుల్లో కేవలం 45 కోట్లు మాత్రమే రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఆమీర్ చిత్రంతో పోటీ పడ్డ అక్షయ్ కుమార్ కొత్త సినిమా ‘రక్షా బంధన్’ కూడా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఐదు రోజుల్లో సుమారు 33.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి అధికారిక రీమేక్ గా వచ్చిన ‘లాల్ సింగ్ చడ్డా’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఆమిర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా, ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. అదే సమయంలో సినిమాకు కూడా ప్రతికూల టాక్ వచ్చింది. దాంతో, ఈ సినిమా వసూళ్లు ఏమాత్రం బాగాలేవు. సోమవారం ఇండియా మార్కెట్లో ‘లాల్ సింగ్ చడ్డా’ రూ. 7.5-8.5 కోట్లు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
దాంతో, ఈ వారాంతపు వసూళ్లు రూ. 45 -46 కోట్లకు చేరాయి. సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి వసూళ్లు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. వచ్చే వారాంతంలో ఈ చిత్రం వ్యాపారం ముగిసే అవకాశం కనిపిస్తోంది. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ‘లాల్ సింగ్ చడ్డా’ కనీసం రూ.100 కోట్ల మార్కును దాటలేకపోవచ్చు అనిపిస్తోంది. ఇది ఆమిర్ ఖాన్ కు పెద్ద ఎదురుదెబ్బ కానుంది. ఎందుకంటే గత నాలుగేళ్లలో అతను నటించిన సినిమాలన్నీ వంద కోట్ల మార్కు దాటాయి.