శామ్ సంగ్, గూగుల్ ఫోన్లకు త్వరలోనే ఆండ్రాయిడ్ 13 రోలవుట్

  • అధికారికంగా ప్రారంభించిన గూగుల్
  • ఈ ఏడాది చివర్లో మిగిలిన కంపెనీల ఫోన్లకు అందుబాటులోకి
  • నూతన ఓఎస్ లో పలు కొత్త ఫీచర్లకు చోటు
గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ 13 వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. ముందుగా గూగుల్ పిక్సల్ ఫోన్లు, శామ్ సంగ్ ఫోన్ యూజర్లకు కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్ రోలవుట్ కానుంది. శామ్ సంగ్ లో ఎంపిక చేసిన మోడళ్లకే ఈ వెసులుబాటు ఉంటుంది. అలాగే, ఐక్యూ, మోటరోలా, వన్ ప్లస్, ఒప్పో, రియల్ మీ, షార్ప్, సోనీ, టెక్నో, వివో, షావోమీ తదితర ఫోన్లలకు ఈ ఏడాది చివర్లో కొత్త ఓఎస్ అందుబాటులోకి వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఇన్ స్టలేషన్ రెడీగా ఉందేమో.. యూజర్లు తమ ఫోన్ సెట్టింగ్స్ లో మై ఫోన్ ఆప్షన్ కు వెళ్లి చూసుకోవచ్చు.

కొత్త ఓఎస్ లో కొన్ని ఫీచర్లు ఉన్నాయి. ఫోన్లలో యాప్ ల వారీగా లాంగ్వేజ్ లను నిర్ణయించుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం ఫోన్ కు ఒకటే లాంగ్వేజ్ ఉండేది. కస్టమైజ్డ్ బెడ్ టైమ్ మోడ్ కూడా ఉంటుంది. ఎంపిక చేసిన సమయంలో ఫోన్ వాల్ పేపర్ డిమ్ గా, డార్క్ గా మారిపోతుంది. ఒక యాప్ పని చేయడానికి వీలుగా మొత్తం ఫోన్ లైబ్రరీ కాకుండా ఎంపిక చేసిన ఫొటోల వరకే యాక్సెస్ ఇవ్వొచ్చు. ఈ ఫీచర్ యాపిల్ ఐవోఎస్ 14 నుంచే అందుబాటులో ఉంది.


More Telugu News