ప్రభాస్ 'సలార్' సినిమా నుంచి బిగ్ అప్డేట్.. రిలీజ్ డేట్ విడుదల

  • ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్'
  • వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల
  • ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రుతి హాసన్
రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం వచ్చింది. ప్రభాస్ తాజా చిత్రం 'సలార్'కు సంబంధించి బిగ్ అప్డేట్ వెలువడింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 'రాధేశ్యామ్' తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. 'కేజీఎఫ్'ను తెరకెక్కించిన హొంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.


More Telugu News