స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ ప్రకటన చేసిన నితీశ్ కుమార్

  • 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తామన్న నితీశ్
  • మరో 10 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటన
  • ముఖ్యమంత్రి అతి పెద్ద ప్రకటన చేశారంటూ తేజస్వి వ్యాఖ్య
మొన్నటి దాకా బీహార్ లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ లు ఇప్పుడు ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఇద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీశ్ సీఎంగా, తేజస్వి డిప్యూటీ సీఎంగా పాలన పగ్గాలు చేపట్టారు. 

మరోవైపు, తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని గత ఎన్నికల సమయంలో తేజస్వి యాదవ్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన డిప్యూటీ ఆకాంక్షను నెరవేర్చేలా సీఎం నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ హామీ ఇచ్చారు. తమ సంకీర్ణ ప్రభుత్వ ఆకాంక్ష మేరకు 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు... మరో 10 లక్షల ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పన కోసం తాము పెద్ద ఎత్తున కృషి చేస్తామని తెలిపారు. 

సీఎం ప్రకటనపై తేజస్వి స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అతి పెద్ద ప్రకటన చేశారని చెప్పారు. సీఎం హామీని నెరవేర్చేందుకు రెండు పార్టీలు కలిసికట్టుగా పని చేస్తాయని తెలిపారు.


More Telugu News