బ్యాట్‌తో చెలరేగిపోతున్న పుజారా.. రాయల్ లండన్ వన్డే కప్‌లో వరుసగా రెండో సెంచరీ
- రాయల్ లండన్ వన్డే కప్‌లో ససెక్స్‌కు ప్రాతినిధ్యం
- వార్షిక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగులు
- నిన్న సర్రేతో జరిగిన మ్యాచ్‌లో 174 పరుగులు బాదిన పుజారా
ఇంగ్లండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్‌లో టీమిండియా బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇరగదీస్తున్నాడు. వరుస సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నాడు. ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా ఈ నెల 12న వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 బంతుల్లో 107 పరుగులు చేశాడు. నిన్న మరోమారు సెంచరీ బాదాడు. సర్రేతో జరిగిన మ్యాచ్‌లో 131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. కెప్టెన్ టామ్ హైనెస్ గైర్హాజరీతో జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన పుజారా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు ఆపద్బాంధవుడయ్యాడు.
3.2 ఓవర్లలో 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన వేళ క్రీజులోకి వచ్చిన పుజారా నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత బ్యాట్ ఝళిపించాడు. టామ్ క్లార్క్‌తో కలిసి మూడో వికెట్‌కు 205 పరుగులు జోడించాడు. 106 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ (104) చేసిన క్లార్క్ అవుటయ్యాక పుజారా మరింతగా చెలరేగాడు. 103 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బౌలర్లపై మరింత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాడు. 28 బంతుల్లోనే 74 పరుగులు పిండుకున్నాడు. పుజారా వీరబాదుడుతో నిన్న మ్యాచ్ ముగిసే సమయానికి ససెక్స్ జట్టు 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది.