ఏపీలో అట్టహాసంగా స్వాత్రంత్ర్య వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్

  • విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో వేడుకలు
  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం
  • సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ‘ఎట్ హోం’
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి హాజరయ్యారు. మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం అందుకున్నారు. 

వేడుకల్లో భాగంగా 12వ కంటిజెంట్స్ నిర్వహించిన పరేడ్‌ను సీఎం జగన్ తిలకించారు. ఆ వాహనంలో ఆయన వెంటన సీఎస్ శమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. అలాగే, 10 బ్యాండ్స్ ప్రదర్శన నిర్వహించనున్నారు. స్వాత్రంత్య వేడుకల సందర్భంగా వివిధ శాఖల శకటాలను సిద్ధం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు నేతలు, అధికారులు హాజరుకానున్నారు.


More Telugu News