ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు
- మిశ్రాకు ఇటీవల మాతృవియోగం
- చత్తీస్ గఢ్ లో కన్నుమూసిన నళినీ మిశ్రా
- విజయవాడలో సీజే నివాసానికి వెళ్లిన జగన్, వైఎస్ భారతి
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఇటీవల మాతృవియోగం కలిగింది. మిశ్రా తల్లి నళినీ మిశ్రా కొన్నిరోజుల కిందట కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా విజయవాడలోని సీజే నివాసానికి వెళ్లారు. మాతృ వియోగంతో బాధపడుతున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆత్మీయంగా పరామర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం కార్యాలయం సోషల్ మీడియాలో పంచుకుంది.
82 ఏళ్ల నళినీ మిశ్రా ఆగస్టు మొదటివారంలో చత్తీస్ గఢ్ లోని రాయగఢ్ లో మృతి చెందారు. అదే సమయంలో కొత్త జడ్జీలతో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంది. అయితే, ఆయన మాతృవియోగంతో బాధపడుతుండడంతో గవర్నర్ కొత్త జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించారు.