వీఎల్ సీ మీడియా ప్లేయర్ పై దేశంలో నిషేధం

  • ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి నిషేధం
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం
  • ధ్రువీకరించిన వీడియోలాన్
  • కారణమేంటో తెలియదన్న సంస్థ
వీఎల్ సీ మీడియా ప్లేయర్ గుర్తుండే ఉంటుంది. ప్రముఖ మీడియా ప్లేయర్లలో ఇది కూడా ఒకటి. దీనిపై గుట్టుచప్పుడు కాకుండా దేశంలో వేటు పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వీడియోలాన్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. దీని వెనుక కచ్చితమైన కారణం ఏంటన్నది తెలియదు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేయలేదు.  

వీఎల్ సీ మీడియా ప్లేయర్ ను చైనా మద్దతు కలిగిన హ్యాకింగ్ గ్రూపు ‘సికాడ’ సైబర్ దాడులకు ఉపయోగిస్తుండడంతో ప్రభుత్వం నిషేధించినట్టు సమాచారం. హానికారక మాల్వేర్ లను వీఎల్ సీ ప్లేయర్ ద్వారా  సికాడ జొప్పిస్తున్నట్టు భద్రతా నిపుణులు కొన్ని నెలల క్రితమే గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న భారత్ లో నిషేధం విధించినట్టు వీడియోలాన్ ధ్రువీకరించింది. ఉన్నట్టుండి ఎందుకు నిషేధం విధించారో తెలియదన్న ఆ సంస్థ.. ఈ విషయంలో భారత పౌరులు మద్దతుగా నిలవాలని కోరింది. 

ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ కు వెళ్లి వీఎల్ సీ ప్లేయర్ ను డౌన్ లోడ్ చేసుకంటే.. డౌన్ లోడ్ అయి, ఇన్ స్టాల్ అవుతోంది. కానీ, అది పనిచేయడం లేదు. ‘పర్మిషన్ నాట్ గ్రాంటెడ్’, ‘నో కనెక్షన్ టు లోకల్ నెట్ వర్క్’ అనే సందేశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News