తెలంగాణ ఆర్టీసీకి రాఖీ పండుగే
- ఒక్కరోజే రూ.20.11 కోట్ల ఆదాయం
- సంస్థ చరిత్రలో ఒక్కరోజు అత్యధిక ఆదాయం ఇదే
- ఫలితమిస్తున్న చార్జీల పెంపు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (టీఎస్ఆర్టీసీ) రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ప్రయాణికులు పెద్ద ఎత్తున రాకపోకలు సాగించడంతో శుక్రవారం ఒక్క రోజు రూ.20.11 కోట్ల ఆదాయం టికెట్ల రూపంలో వచ్చింది. సంస్థ చరిత్రలో ఒక రోజు రూ.20 కోట్లు రావడం ఇదే మొదటిసారి. రూ.15.59 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా, దీన్ని మించి వసూళ్లు కావడంతో ఆర్టీసీ అధికారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో ఆర్టీసీ రెండు పర్యాయాలు భారీగా చార్జీలను పెంచింది. లగేజీ చార్జీలను కూడా సవరించింది. గతంతో పోలిస్తే మొత్తం మీద ఈ పెంపు 30 శాతం వరకు ఉంది.
ఈ చర్యల ఫలితంగా ఆర్టీసీకి రోజువారీ రూ.13-15 కోట్ల మధ్య ఆదాయం వస్తోంది. రాఖీ పండుగను తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటుంటారు. సోదరులు ఎక్కడున్నా వెళ్లి స్త్రీలు రాఖీ కడుతుంటారు. అలాగే, రాఖీ కోసమని నగరాల నుంచి సొంతూర్లకు వెళ్లే వారూ ఉన్నారు. దీంతో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది.