బ్యాంకు సిబ్బందికి మత్తు మందు ఇచ్చి రూ.20 కోట్ల బంగారాన్ని దోచుకెళ్లిన దొంగలు
- చెన్నైలో జరిగిన భారీ చోరీ
- నగరంలోని ఆరుంబాక్కంలోని ఫెడ్ గోల్డ్ బ్యాంకులో ఘటన
- వినియోగదారుల మాదిరి వచ్చిన ముగ్గురు దొంగలు
- బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం భారీ చోరీ జరిగింది. నగరంలోని అరుంబాక్కంలోని ఫెడ్‌గోల్డ్ బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు ఏకంగా రూ.20 కోట్ల విలువ చేసే బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ చోరీని దొంగలు అత్యంత చాకచక్యంగా చేసినట్లు సమాచారం. బ్యాంకులోకి వినియోగదారుల మాదిరిగా ప్రవేశించిన ముగ్గురు దొంగలు... బ్యాంకు సిబ్బందికి మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడ్డారు.
దొంగలు ఇచ్చిన మత్తు మందు ఫలితంగా బ్యాంకు సిబ్బంది స్పృహ కోల్పోగా... ముందస్తు ప్రణాళికలో భాగంగా దొంగలు బ్యాంకులోని బంగారాన్ని ఎలాంటి ప్రతిఘటన లేకుండానే ఎత్తుకెళ్లారు. దొంగలు బంగారాన్ని ఎత్తుకెళ్లిన చాలా సేపటికి స్పృహలోకి వచ్చిన బ్యాంకు సిబ్బంది జరిగిన విషయాన్ని తెలుసుకుని బావురుమన్నారు. ఆ తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు.