ఎంపీ మాధవ్ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించాం: టీడీపీ నేత పట్టాభి
- మాధవ్ పై జగన్ చర్యలు తీసుకోరన్న పట్టాభి
- అందుకే ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించినట్టు వెల్లడి
- అందులో ఉన్నది మాధవ్ అని రిపోర్ట్ చెబుతోందని వివరణ
- ఇంకేం ఆధారాలు కావాలని సీఎం జగన్ పై ఆగ్రహం
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. ఎంపీ మాధవ్ పై జగన్ చర్యలు తీసుకోరన్న విషయం తమకు తెలుసని, అందుకే ఆ వీడియోకు అమెరికాలో ఫోరెన్సిక్ టెస్టు చేయించినట్టు వివరించారు. ఆ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ అని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసిందని పట్టాభి వెల్లడించారు. పిట్టకథలు చెబుతున్న సజ్జల దీనిపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఆ వీడియోలో ఎలాంటి మార్ఫింగ్, ఎడిటింగ్ జరగలేదని నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. మీ ఎంపీపై చర్యలు తీసుకోవడానికి ఈ సాక్ష్యాధారాలు సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? మిస్టర్ జగన్ రెడ్డీ అంటూ ప్రశ్నించారు. ఆ వీడియోను ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండానే ఎంపీ మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని పట్టాభి ఆరోపించారు.