ద‌క్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ

  • తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల‌కు పూర్తి స్థాయి ఇంచార్జీగా ప్రియాంక
  • సీడబ్ల్యూసీ భేటీ త‌ర్వాత అధికారిక ప్ర‌కట‌న‌
  • మునుగోడు ఉప ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ కీల‌క నిర్ణ‌యం
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం శ‌నివారం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సంబంధించి ఆ పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ వాద్రాను నియ‌మించేందుకు సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) భేటీ త‌ర్వాత ఈ నిర్ణ‌యానికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రాష్ట్రాల‌కు పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. అందులోనూ క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రాల పార్టీ శాఖ‌ల‌కు ఆమె పూర్తి స్థాయి ఇంచార్జీగా వ్య‌వ‌హ‌రిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ‌, మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న సమయాన కాంగ్రెస్ పార్టీ ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.


More Telugu News