ఆ సినిమా తీసి కెరీర్ కు ఇక ముగింపు పలుకుతా: అశ్వనీ దత్
- జగదేక వీరుడు అతిలోక సుందరి - 2 తీసి కెరీర్ ను ముగిస్తానన్న దత్
- తొలి సినిమాను రూ. 16 లక్షలతో నిర్మించానని వెల్లడి
- సినిమాకు ఓటీటీ ప్రమాదకరం కాదని వ్యాఖ్య
టాలీవుడ్ లో నిర్మాత అశ్వనీ దత్ ది ఒక సుదీర్ఘమైన పయనం. దశాబ్దాల తన కెరీలో ఆయన ఎన్నో ఘనమైన సినిమాలను నిర్మించారు. ఆయన తాజా చిత్రం 'సీతా రామం' కూడా ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరి - 2' సినిమా తీసి తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడతానని చెప్పారు.
నిర్మాతగా కెరీర్ ను ప్రారంభించినప్పుడు రూ. 16 లక్షలతో సినిమా తీశానని గుర్తు చేసుకున్నారు. అల్లు అరవింద్ తో కలిసి 'చూడాలని ఉంది' సినిమాను హిందీలో రీమేక్ చేశానని... ఈ సినిమా వల్ల చెరో రూ. 6 కోట్లు పోగొట్టుకున్నామని చెప్పారు.
'స్టూడెంట్ నెంబర్ 1' సినిమాకు మొదట ప్రభాస్ ని హీరోగా అనుకున్నానని... చివరకు జూనియర్ ఎన్టీఆర్ ఓకే అయ్యాడని తెలిపారు. ఓటీటీ అనేది సినిమాకు ప్రమాదకరమని తాను భావించడం లేదని చెప్పారు. సినిమాను ప్రదర్శించేందుకు అదొక ప్రత్యామ్నాయ మార్గమని అన్నారు. తన దృష్టిలో యూట్యూబ్ చాలా ప్రమాదకరమని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ ను తాను ఎప్పుడూ దైవంగా భావిస్తానని అన్నారు.