ఏపీ గవర్నర్‌ను కలిసిన టీడీపీ, కాంగ్రెస్, జనసేన మహిళలు.. వైసీపీ ఎంపీ గోరంట్లపై ఫిర్యాదు
- మహిళా జేఏసీ పేరిట రాజ్ భవన్ కు వెళ్లిన 3 పార్టీల ప్రతినిధులు
- ఎంపీ గోరంట్ల వీడియోపై నిజాలు నిగ్గు తేల్చాలని వినతి
- చర్యల కోసం విశేషాధికారాలు వినియోగించాలన్న మహిళా జేఏసీ
మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను తేల్చాలని కోరుతూ మహిళా జేఏసీ ప్రతినిధులు శుక్రవారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. టీడీపీ, కాంగ్రెస్, జనసేనలకు చెందిన మహిళా నేతలంతా కలిసి మహిళా జేఏసీ పేరిట శుక్రవారం విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఓ వినతి పత్రం అందజేశారు.
మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పిన మహిళా జేఏసీ... ఈ వ్యవహారం మహిళా లోకానికే సిగ్గు చేటని ఆరోపించారు. ఈ విషయంలో స్వతంత్రంగా వ్యవహరించి నిజాలు నిగ్గు తేల్చాలని, నిందితుడిపై చర్యలు తీసుకునే విషయంలో గవర్నర్‌కు ఉండే విశేషాధికారాలను వినియోగించాలని ఈ సందర్భంగా వారు బిశ్వభూషణ్‌ను కోరారు.