త‌గ్గిన ద్ర‌వ్యోల్బ‌ణం, పెరిగిన పారిశ్రామికోత్ప‌త్తి... కేంద్రం గ‌ణాంకాలు ఇవిగో

  • 7.01 నుంచి 6.71కి త‌గ్గిన ద్ర‌వ్యోల్బ‌ణం
  • పారిశ్రామికఉత్ప‌త్తిలో 12.7 శాతం పెరుగుద‌ల‌
  • వెల్ల‌డించిన కేంద్రం నివేదిక‌
క‌రోనా గ‌డ్డు ప‌రిస్థితుల నేప‌థ్యంలో దేశంలో ఆర్థికంగా ఓ మోస్త‌రు మెరుగుద‌ల న‌మోదైంది. దేశంలో ఆందోళ‌న రేకెత్తిస్తున్న ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గ‌గా... అదే స‌మ‌యంలో ఎదుగూ బొదుగూ లేకుండా సాగుతున్న పారిశ్రామిక ఉత్ప‌త్తి గ‌ణ‌నీయంగా పెరిగింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ద్ర‌వ్యోల్బ‌ణం, పారిశ్రామికోత్ప‌త్తికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన నివేదిక దేశ ప్ర‌జ‌ల‌కు ఊర‌ట‌నిచ్చే వార్త‌ను చెప్పింది.

జూన్ మాసంలో 7.01గా ఉన్న ద్ర‌వ్యోల్బ‌ణం.. జులై మాసానికంతా 6.71కి దిగింది. ద్ర‌వ్యోల్బ‌ణంలో త‌రుగుద‌ల లేశ‌మాత్ర‌మే అయిన‌ప్ప‌టికీ... ఈ మాత్రం మార్పు కేవ‌లం నెల వ్య‌వ‌ధిలోనే క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. ఇక ఏప్రిల్‌- జూన్ మాసంలో దేశంలో పారిశ్రామికోత్ప‌త్తిలో ఏకంగా 12.7 శాతం పెరుగుద‌ల న‌మోదైంది. వెర‌సి ఇటు ద్ర‌వ్యోల్బ‌ణం దిగివ‌స్తుండ‌గా... పారిశ్రామికోత్ప‌త్తి పెరుగుద‌ల ఆహ్వానించద‌గ్గ ప‌రిణామమేన‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.


More Telugu News