8 నెలల్లో 17 శాతం ప్రజాదరణను పెంచుకున్న జగన్... మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే వెల్లడి
- ఇండియా టుడే చేపట్టిన సర్వే ఫలితాల వెల్లడి
- జగన్ జనాదరణ 57 శాతానికి పెరిగిందన్న సర్వే
- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడి
- జనాదరణ కలిగిన సీఎంలలో జగన్ ఐదో స్థానంలో నిలిచారన్న సర్వే
'మూడ్ ఆఫ్ ద నేషన్' పేరిట ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో ఏపీలో మరోమారు వైసీపీదే విజయమని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ 18 సీట్లను గెలుచుకుంటుందని ఆ సర్వే పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్రంలోనూ వైసీపీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కుతుందని కూడా చెప్పింది.
ఇక ప్రజల్లో జగన్ పట్ల ఆదరణ మరింతగా పెరిగిందని ఆ సర్వే తెలిపింది. ఈ ఏడాది జనవరిలో జరిపిన సర్వేలో జగన్‌కు 40 శాతం జనాదరణ కనిపించగా... తాజాగా ఈ నెలలో చేపట్టిన సర్వేలో అది ఏకంగా 17 శాతం పెరిగి 57 శాతానికి చేరుకుంది. అంతేకాకుండా దేశంలోని అత్యంత జనాదరణ కలిగిన సీఎంలలో జగన్ ఐదో స్థానంలో నిలిచినట్లు ఆ సర్వే వెల్లడించింది.