ఏపీలో ఎంపీడీఓల‌కు ప‌దోన్న‌తులు... ఒకేసారి 237 మందికి ప్ర‌మోష‌న్‌

  • 25 ఏళ్లుగా ప‌దోన్న‌తులు లేకుండానే ప‌నిచేస్తున్న ఎంపీడీఓలు
  • తాజాగా ఎంపీడీఓల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించిన ఏపీ ప్రభుత్వం
  • తొలి విడ‌త‌లోనే 237 మంది ఎంపీడీఓల‌కు ప‌దోన్న‌తి
  • సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఎంపీడీఓల సంఘం
ఏళ్ల త‌ర‌బ‌డి ప‌దోన్న‌తుల కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీఓ (మండ‌ల ప‌రిష‌త్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీస‌ర్)ల‌కు వైసీపీ స‌ర్కారు తీపి క‌బురు చెప్పింది. ఎంపీడీఓల‌కూ ప‌దోన్న‌తులు ఇస్తున్నామ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... అందులో భాగంగా తొలి విడ‌త‌లోనే ఏకంగా 237 మందికి ప‌దోన్న‌తులు క‌ల్పించింది. 

ఏపీలో దాదాపుగా 25 ఏళ్ల త‌ర‌బ‌డి ప‌దోన్న‌తులు లేకుండానే ఎంపీడీఓలు ప‌ని చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌దోన్న‌తుల కోసం ఎంపీడీఓలు గ‌ళం విప్ప‌డం, ప్ర‌భుత్వాలు హామీ ఇవ్వ‌డం మిన‌హా ఇప్ప‌టిదాకా ఫ‌లితం క‌నిపించ‌లేదు. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు ఎంపీడీఓల క‌ల‌ను సాకారం చేస్తూ వారికి ప‌దోన్న‌తులు క‌ల్పించింది. 

తొలి విడ‌త‌లో ప‌దోన్న‌తులు పొందిన 237 మందికి డిప్యూటీ సీఈఓ, డీడీఓలుగా పోస్టింగులు ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చిన ఎంపీడీఓల సంఘం నేత‌లు జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.


More Telugu News