ఇంటి అద్దెపై జీఎస్టీ కట్టాలా..?

  • జులై 18 నుంచి అమల్లోకి వచ్చిన 18 శాతం జీఎస్టీ 
  • కిరాయిదారులు ఈ మేరకు ఇంటి యజమానికి చెల్లించాలి
  • వేతన జీవులకు అవసరం లేదు
  • వ్యాపారం, వృత్తుల్లో ఉన్నవారికే
ఇంటి అద్దెపై జీఎస్టీ ఏంటి అని అనుకుంటున్నారా..? కిరాయికి ఉంటూ, జీఎస్టీ కింద నమోదు చేసుకున్న వారు కచ్చితంగా 18 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో ఈ మేరకు సిఫారసును ఆమోదించారు. జీఎస్టీ చెల్లించడం ద్వారా, ఈ మేరకు రిటర్నుల్లో తగ్గింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. 

ఈ ఏడాది జులై 17 వరకు ఇంటి అద్దెలపై జీఎస్టీ లేదు. కిరాయిదారు, ఇంటి యజమాని జీఎస్టీ కింద నమోదు చేసుకున్న దానితో సంబంధం ఉండేది కాదు. కానీ, ఈ ఏడాది జులై 18 నుంచి జీఎస్టీ కింద నమోదైన కిరాయిదారులు అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందేనని చట్టం చెబుతోంది.

వేతన జీవులు ఇంటిని లేదా ఫ్లాట్ ను అద్దెకు తీసుకుంటే వారు జీఎస్టీ చెల్లించక్కర్లేదు. జీఎస్టీ కింద నమోదై, వ్యాపారం లేదా వృత్తి పనులు చేస్తున్న వారు అద్దె ఇళ్లల్లో ఉంటే 18 శాతం జీఎస్టీని ఇంటి యజమానికి చెల్లించాలి.


More Telugu News