తెలంగాణ ఎంసెట్ లో సత్తా చాటిన ఆంధ్ర విద్యార్థులు
- ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబిత
- ఇంజినీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన హైదరాబాద్ విద్యార్థి లోహిత్ రెడ్డి
- మెడిసిన్ లో తొలి ర్యాంక్ సాధించిన గుంటూరు జిల్లా విద్యార్థిని నేహ
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. జేఎన్టీయూ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్ పరీక్షకు 1,56,812 మంది... అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల పరీక్షలకు 80,575 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ లో 80.41 శాతం, అగ్రికల్చర్ లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు టీఎస్ ఎంసెట్ లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు.
ఇంజినీరింగ్:
అగ్రికల్చర్ అండ్ మెడికల్:
ఇంజినీరింగ్:
- ఫస్ట్ ర్యాంక్ - పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి (హైదరాబాద్)
- సెకండ్ ర్యాంక్ - నక్కా సాయి దీప్తిక (శ్రీకాకుళం జిల్లా, ఏపీ)
- థర్డ్ ర్యాంక్ - పోలిశెట్టి కార్తికేయ (గుంటూరు జిల్లా, ఏపీ)
- ఫోర్త్ ర్యాంక్ - పల్లి జలజాక్షి (శ్రీకాకుళం జిల్లా, ఏపీ)
- ఫిఫ్త్ ర్యాంక్ - మెండ హిమ వంశీ (శ్రీకాకుళం జిల్లా, ఏపీ).
అగ్రికల్చర్ అండ్ మెడికల్:
- ఫస్ట్ ర్యాంక్ - జూటూరి నేహ (గుంటూరు జిల్లా, ఏపీ)
- సెకండ్ ర్యాంక్ - రోహిత్ (విశాఖపట్నం జిల్లా, ఏపీ)
- థర్డ్ ర్యాంక్ - కల్లం తరుణ్ కుమార్ రెడ్డి (గుంటూరు జిల్లా, ఏపీ)
- ఫోర్త్ ర్యాంక్ - కొత్తపల్లి మహీత్ అంజన్ (హైదరాబాద్)
- ఫిఫ్త్ ర్యాంక్ - గుంటుపల్లి శ్రీరామ్ (గుంటూరు, ఏపీ).