ప్రియురాలితో కొణిదెల హీరో పవన్ తేజ్ నిశ్చితార్థం

  • నటి మేఘనను పెళ్లాడబోతున్న పవన్ తేజ్
  • 'ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్రంలో కలిసి నటించిన జంట
  • వేడుకకు హాజరైన చిరంజీవి భార్య సురేఖ
కొణిదెల వారి కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. ఆ కుటుంబం నుంచి ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరో నటుడు పవన్ తేజ్ ఓ ఇంటివాడు అవుతున్నాడు. సినీ నటి, బుల్లితెర యాంకర్ మేఘనను ఆయన పెళ్లాడబోతున్నాడు. వీరి నిశ్చితార్థం తాజాగా జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖ, సినీ దర్శకుడు మెహర్ రమేశ్, నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పవన్ తేజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ... ప్రేమతో తమ ప్రయాణం మొదలైందని... ఆమె వల్లే ప్రేమ అంటే ఏమిటో తనకు అర్థమయిందని చెప్పాడు. ఈ వేడుకకు వచ్చి తమను ఆశీర్వదించిన సురేఖ చిన్నమ్మకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నాడు. చిన్నతనం నుంచి చిరంజీవి బాబాయ్ తనకెంతో సపోర్ట్ చేశారని చెప్పాడు. 

ఇక పవన్ తేజ్, మేఘన ఇద్దరూ 'ఈ కథలో పాత్రలు కల్పితం' సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరికీ పరిచయం కలిగింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఇప్పుడు వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటున్నారు.


More Telugu News