విశాఖ ఆర్కే బీచ్‌లో నల్లగా మారిపోయిన ఇసుక.. సందర్శకుల ఆందోళన

  • ఇసుక ఇలా నల్లగా మారడాన్ని తామెప్పుడూ చూడలేదన్న స్థానికులు
  • దానిపై కాలుపెట్టేందుకు భయపడిన సందర్శకులు
  • సముద్రంలోని మురుగు కొట్టుకొచ్చినప్పుడు ఇలా జరుగుతుందన్న నిపుణులు
విశాఖపట్టణం ఆర్కే బీచ్‌లోని ఇసుక నిన్న ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. బంగారంలా నిగనిగలాడే ఇసుక ఒక్కసారిగా నల్లగా కనిపించడంతో సందర్శకులు ఆందోళనకు గురయ్యారు. ఆర్కే బీచ్‌లో ఇసుక ఇలా నల్లగా మారడాన్ని ఎప్పుడూ చూడని స్థానికులు ఆ ఇసుకపై కాలు పెట్టేందుకు కూడా భయపడ్డారు. ఇసుక ఇలా నల్లగా మారడాన్ని తాము ఇప్పటి వరకు చూడలేదని స్థానికులు పేర్కొన్నారు. 

ఇసుక అకస్మాత్తుగా నల్లగా ఎందుకు మారిందన్న దానిపై ఆంధ్రా యూనివర్సిటీ భూ విజ్ఞానశాస్త్ర నిపుణుడు ప్రొఫెసర్ ధనుంజయరావు మాట్లాడుతూ.. సముద్రంలోని మురుగు అప్పుడప్పుడు ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు ఇలా మారుతుందన్నారు. సముద్రంలోని ఇనుప రజను ఎక్కువశాతం ఒడ్డుకు కొట్టుకొచ్చినప్పుడు కూడా ఇలానే మారుతుందన్న ఆయన.. ఇసుకను పరిశోధిస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు.


More Telugu News