'మాచర్ల'తో నా ముచ్చట తీరింది: నితిన్
- పొలిటికల్ టచ్ తో సాగే 'మాచర్ల నియోజకవర్గం'
- రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
- ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న టీమ్
- డాక్టర్ కావాలని ఉండేదన్న కృతి
నితిన్ హీరోగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందింది. ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కేథరిన్ .. కృతిశెట్టి కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించాడు. పొలిటికల్ టచ్ తో కూడిన ఈ మాస్ యాక్షన్ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో నితిన్ మాట్లాడుతూ .. "నా చిన్నప్పుడు ఎవరైనా సరే .. పెద్దయిన తరువాత ఏమౌతావని అడిగితే, ఐఏఎస్ అవుతానని అనేవాడిని. ఆ తరువాత పెద్దవుతూ ఉంటే మార్కులు తగ్గిపోతూ వచ్చాయి. ఇక ఇప్పుడు 'మాచర్ల నియోజకవర్గం'లో ఐఏఎస్ అధికారిగా నటించడంతో, నా ముచ్చట తీరింది" అని చెప్పుకొచ్చాడు.
ఇక కృతి శెట్టి మాట్లాడుతూ . "నాకు డాక్టర్ ను కావాలని ఉండేది. కానీ అనుకోకుండా ఈ వైపుకు వచ్చేశాను. ఈ సినిమాలో నా పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. డైరెక్టర్ గారు నా పాత్రను చాలా బాగా మలిచారు. ఈ సినిమా నాకు మరింత పేరు తీసుకుని వస్తుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.